ఏ కోదండ రామి రెడ్డి డైరెక్టర్ గ తన కెరీర్ 1980 లో ప్రారంభించి దాదాపుగా 94 చిత్రాలకు దర్శకత్వం వహించి, అందరు అగ్ర హీరోల కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ అందించిన గొప్ప దర్శకుడు. అటువంటి దర్శకుడికి నందమూరి తారక రాముడితో ఒక అరుదయిన అనుభూతి ఉంది. డైరెక్టర్ గ కోదండ రామి రెడ్డి యెన్. టి.ఆర్. చిత్రాలు డైరెక్ట్ చేయకపోయినా, యెన్.టి.ఆర్. బాలయ్య బాబు తో నిర్మించిన “అనసూయమ్మ గారి అల్లుడు” చిత్రానికి డైరెక్టర్ గ చేసారు. ఆ సినిమా పూర్తి అయి ప్రివ్యూ వేసే టైం లో కోదండ రామి రెడ్డి కాశ్మీరులో ఉన్నారు, ప్రివ్యూ కోసం హైదరాబాద్ వచ్చారు. కాశ్మీర్ లో బాత్ రూమ్ లో పడి చేయి విరిగింది, చేతికి కట్టుతో ప్రివ్యూ కి వచ్చారు.
సినిమా ప్రివ్యూ మొదలయింది, బ్రేక్ టైం లో అందరు సినిమా బాగా వచ్చింది అని మెచ్చుకున్నారు, స్నాక్స్ వచ్చాయి, ప్లేట్ డైరెక్టర్ కి అందించారు యెన్.టి.ఆర్. ఒక్క చేతి తో ప్లేట్ అందుకున్న రెడ్డి గారిని చూసి, యెన్.టి.ఆర్. గారే స్పూన్ తో స్నాక్స్ తినిపించారు,యెన్.టి.ఆర్. చూపించిన ప్రేమకు రెడ్డి గారు కన్నీటి పర్యంతం అయ్యారు. అప్పుడు యెన్,టి.ఆర్. ఆంధ్ర రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ గ ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి తనకు స్నాక్స్ తినిపిస్తుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని కోదండ రామి రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారట. డైరెక్టర్స్ కి యెన్.టి.ఆర్ గారు ఇచ్చే గౌరవం అటువంటిది, ఆయనకు సాటి మనిషి మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఎంత మందికి ఇటువంటి అరుదయిన అదృష్టం దక్కుతుంది చెప్పండి.