in

Forensic report confirms Sanjjanaa Galrani, Ragini Dwivedi took drugs!

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శాండిల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ లో నటీమణులు సంజన గల్రానీ – రాగిణి ద్వివేది లను బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పై విడుదలైన ఈ ఇద్దరు హీరోయిన్లకు ఈ కేసులో ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. రాగిణి – సంజనలు డ్రగ్స్ తీసుకున్నట్లు FSL రిపోర్టులో తేలింది. బెంగళూరు పోలీసులు 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుకలను  FSLకు పంపగా..

ఈ హీరోయిన్లు డ్రగ్స్ సేవించినట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది. దీంతో మరోసారి రాగిణి – సంజన లకు సమన్లు జారీ చేయనున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది – సంజనా గల్రాని తో పాటు మరో 25 మందిపై చార్జిషీట్ ఫైల్ అయింది.

2019 మే 26న రాగిణి ద్వివేది బర్త్ డే పార్టీలో డ్రగ్స్ సరఫరా చేయడం.. ప్రియుడు రవిశంకర్ తో కలసి ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీలో ఎక్స్టసీ డ్రగ్ మాత్రలు తీసుకోవడం.. ఇతరులకూ సరఫరా చేయడం వంటి వాటిని ఈ చార్జిషీట్ లో ప్రస్తావించారు. అలానే సంజన కు డ్రగ్స్ వినియోగం మరియు సరఫరాతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు FSL రిపోర్టులో హీరోయిన్లు ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది.

i am not retiring, manchu manoj shuts rumors!

shraddha das at Miss Mrs blissful india event!