నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేక పోవడం ఒక రోగం” అన్నారు జంధ్యాల వారు. తాను నమ్మిన దానిని ఆచరించి అందరికి నవ్వుల పువ్వులు పంచిన “హాస్య బ్రహ్మ ” జంధ్యాల గారు. జంధ్యాల గారు తన ఇంటి పేరుతో లబ్ధ ప్రతిష్టులు, అయన వంటి పేరు మాత్రం చాలా మందికి తెలియదు. మీకు తెలుసా? తెలియదు కదూ! జంధ్యాల గారిని మీ పూర్తి పేరు ఏమిటండి అని ఎవరయినా అడిగితే, కాశీ లో విశ్వేశ్వరుడిని, శ్రీశైలం లో మల్లికార్జునిడిని అన్న రేంజ్ లో, నేను రామ నాయుడు గారి సినిమా చేస్తున్నపుడు జంధ్యాల రామ నాయుడుని,
విశ్వనాథ్ గారి సినిమా చేస్తున్నపుడు జంధ్యాల విశ్వనాథ్ ను అని చెప్పే వారు కానీ అయన పేరు మాత్రం చెప్పే వారు కాదు. అయన ఎంతో గడసరి, అయన పేరు చాల పొడగరి. అబ్బహ్! ఆపార బాబు ఆయన పేరెందో చెప్పు అంటారా, అయితే కాస్కోండి, ” జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్ట్రీ” అదండీ బాబు జంధ్యాల గారి పూర్తి పేరు. ఇంటి పేరునే వంటి పేరుగా మార్చుకొని, తన పెన్ను పాళీ తో అందరి ముఖాలలో హాస్య సంతకం చేసిన “హాస్యబ్రహ్మ ” జంధ్యాల.