బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ తొలి సినిమాగా కేదార్‌నాథ్ చేసింది. ఈ సినిమా సారాకు అంత గుర్తింపునివ్వలేదు. సింబా సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో జతకట్టి బాలీవుడ్ ప్రేక్షకులని అలరించడంతో సారాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. తన తండ్రి ఇమేజ్ వాడకుండానే సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న ఈ అమ్మడు ఇటీవల చాలా స్లిమ్ కూడా అయింది.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రమాదవశాత్తు ముక్కు పగులకొట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని సారా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమ్మ నాన్న ఇగ్గీ క్షమించండి. ముక్కు పగులకొట్టుకున్నాను నేను అంటూ కామెంట్ పెట్టింది. అయితే సారా ముక్కుకి తగిలింది చిన్న దెబ్బేమి కాదు. చాలా బలంగానే ఏదో తగిలి ఉంటుంది. దేని వలన తన ముక్కు అలా అయిందో సారా వివరించలేదు…నెటిజన్స్ మాత్రం సారా ఆరోగ్యం గురించి ఆరాలు తీస్తూనే ఆమెకు పలు సూచనలు చేస్తున్నారు. ఎంతో అందమైన ముఖంపై ఇలాంటి గాయం కావడం బాధగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ముఖంపై మచ్చ పడకుండా జాగ్రత్త తీసుకో అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.