in

Surekha Vani trashes rumours about Bigg Boss 5 entry!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం అందించింది సురేఖా వాణి. కేవలం సినిమాల్లో కనిపించడమే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.బిగ్ స్క్రీన్ పై ఎప్పుడూ సంప్రదాయంగా కనిపించే సురేఖా.. సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలతోపాటు.. మోడ్రన్ లుక్కులో ఉండే ఫోటోలను షేర్ చేస్తూ కిక్కిస్తుంది. కూతురితో క‌లిసి సంద‌డి చేస్తున్న ఫొటోలు వీడియోలు ఈ మ‌ధ్య ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇందులో సురేఖా వాణి ..

కూతురు సుప్రిత‌కు సిస్ట‌ర్‌లా ఉంది. ఇప్ప‌టికి గ్లామ‌ర్ మెయింటైన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తుంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో త‌న సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది సురేఖా. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజ‌న్ జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవ‌ల సీజ‌న్ 5కి సంబంధించిన లోగో విడుద‌ల చేయ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది.

కొద్ది రోజులుగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌కి సంబంధించిన జాబితా ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో సురేఖా వాణి పేరు కూడా ఉంది. బిగ్‌బాస్‌ ఎంట్రీ పుకార్లపై సురేఖవాణి తాజాగా క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్‌బాస్‌ షోకి వెళ్లడం లేదని, దయ చేసి ఇలాంటి తప్పుడు వార్తలను రాయకండి అంటూ.. తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టింది. దీంతో సురేఖా బిగ్ బాస్ షోలో పాల్గొన‌దని నెటిజ‌న్స్ చ‌ర్చించుకుంటుండ‌గానే ఆ పోస్ట్‌ని డిలీట్ చేసి మ‌ళ్లీ స‌స్పెన్స్‌లో పెట్టింది.ఈ క్ర‌మంలో ఆమె బిగ్‌బాస్‌లోకి ఆమె ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది మరోసారి ప్రశ్నార్థకంగానే మారింది.

Katrina Kaif item song in prabhas ‘Salaar’!

Telugu Anchor Vishnu Priya Latest Stills

Telugu Anchor Vishnu Priya Latest Stills