in

charmee kaur announces break to social media!

స్మార్ట్ శంకర్ సినిమాతో నిర్మాతగా ఛార్మి ఖాతాలో సక్సెస్ చేరింది. ప్రస్తుతం ఛార్మి లైగర్ సినిమా పనులతో బిజీగా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది..ఛార్మి సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడంతో పాటు ఛార్మి వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఛార్మి సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు.

ఛార్మి చేసిన ప్రకటనతో షాకవ్వడం అభిమానుల వంతైంది. సోషల్ మీడియా నుంచి ఛార్మి విరామం కోరుకోవడానికి అసలు కారణం తెలియాల్సి ఉంది. ఛార్మికి ప్రస్తుతం ట్విట్టర్ లో ఆరు లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఛార్మి సన్నిహితులు మాత్రం ఆమె ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటం వల్లే సోషల్ మీడియాకు విరామం ప్రకటించారని చెబుతున్నారు. మరోవైపు ఛార్మి నటిగా బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఛార్మి సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతారేమో చూడాల్సి ఉంది. నిర్మాతగా కొన్ని సినిమాల వల్ల నష్టపోయిన ఛార్మికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆ నష్టాలు భర్తీ అయ్యాయి.

Keeravani Charging A Sensational Remuneration For RRR!

Anchor Syamala Saree Stills at an Audio Launch!