in

Aakanksha Singh to reunite with Nani for ‘Meet Cute’!

మ‌ళ్లీ రావా సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది జైపూర్ బ్యూటీ ఆకాంక్ష సింగ్‌. ‘అ’ సినిమా త‌ర్వాత నాని ‘మీట్ క్యూట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ కోలీవుడ్ న‌టుడు స‌త్యరాజ్ లీడ్ రోల్ లో న‌టిస్తున్నాడు. నాని సోద‌రి దీప్తి గంట నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఆదా శ‌ర్మ‌, నివేదా థామ‌స్, రుహాణి శ‌ర్మ కీ రోల్స్ పోషిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వచ్చింది. దేవ్ దాస్ లో నానితో క‌లిసి న‌టించిన ఆకాంక్ష సింగ్ ‘మీట్ క్యూట్’లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌న‌ట్వంటి పాత్ర‌లో తాను క‌నిపించ‌బోతున్నాన‌ని, మీట్ క్యూట్‌లో న‌టించ‌డం చాలా ఎక్జ‌యిటింగ్ గా ఉంద‌ని చెప్పింది ఆకాంక్ష సింగ్‌. బాహుబ‌లి కాస్ట్యూమ్ డిజైన‌ర్ ప్ర‌శాంతి ఈ చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేస్తుండ‌టం విశేషం.

Venkatesh’s daughter makes it to Instagram Rich List 2021!

f cube ‘ruhani sharma’!