మెహ్రీన్ కి బిష్ణోయ్, అతని కుటుంబం సరైన విలువ ఇవ్వలేదని, అందుకే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో భవ్య బిష్ణోయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తమ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే దూరం కావాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఈ నెల 1న ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. మెహ్రీన్ పరిచయం అయినప్పటి నుంచి ఆమెను తాను ఎంతో ప్రేమించానని చెప్పాడు. తమ కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఎంతో గౌరవించారని తెలిపాడు.
తమ ఇద్దరిది మంచి జోడీ అవుతుందని అనుకున్నామని..కానీ కాలం తమ జీవితాలను వేరు చేసిందని చెప్పాడు. మెహ్రీన్ నుంచి విడిపోతున్నందుకు తాను బాధ పడటం లేదని అన్నాడు. మెహ్రీన్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని బిష్ణోయ్ తెలిపాడు. తన కలలన్నింటినీ మెహ్రీన్ సాకారం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నాడు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ విమర్శించేలా కామెంట్లు చేసే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మెహ్రీన్ ప్రేమానురాగాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పాడు.