in

Prakash Raj to lock horns with Pawan Kalyan again?

బ‌ద్రి సినిమాలో నందాగా ప్ర‌కాష్ రాజ్ పండించిన విల‌నీ.. ప‌వ‌న్‌కు, ఆయ‌న‌కు మ‌ధ్య వ‌చ్చిన స‌న్నివేశాలు ఎలా పేలాయో తెలిసిందే. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు దాటినా ఇంకా అందులోని స‌న్నివేశాల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటారు అభిమానులు. ఈ మ‌ధ్యే వ‌కీల్ సాబ్ సినిమాలో ప‌వ‌న్, ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి త‌ల‌ప‌డ్డారు. ఈసారి వారి మ‌ధ్య యాక్ష‌న్ ఘ‌ట్టాలేమీ లేక‌పోయినా.. కోర్టులో లాయ‌ర్లుగా ఒక‌రితో ఒక‌రు త‌ల‌ప‌డే స‌న్నివేశాల‌ను బాగా పండించారు..ఐతే ఈసారి అలా కాకుండా..

బ‌ద్రిలో మాదిరి ఫిజిక‌ల్‌గా త‌ల‌ప‌డ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది టాలీవుడ్లో. ప‌వ‌న్ త్వ‌ర‌లోనే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విల‌న్ పాత్ర‌ను ప్ర‌కాష్ రాజ్‌తోనే చేయించ‌నున్నార‌ట. ఇటీవ‌లే హ‌రీష్ బ‌ద్రి సినిమాలో ప‌వ‌న్ యాటిట్యూడ్ చూపించే స‌న్నివేశాల‌తో కూడిన‌ ఓ వీడియోను షేర్ చేసి ఈ ఎన‌ర్జీని మ‌ళ్లీ చూద్దాం అంటూ ప‌వ‌న్ అభిమానుల‌ను ఊరించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాలో న‌టించ‌నున్న నేప‌థ్యంలోనే హ‌రీష్ ఈ వీడియో షేర్ చేసి, ఆ కామెంట్ పెట్టాడ‌ని భావిస్తున్నారు.

Raai Laxmi wows us in sarees too!

vijay shanthi supports ‘Telangana’ Sentiment In MAA Elections!