in

krishna, vani sri madya godavalu ravadaniki karanam idhe!

వాణిశ్రీ తో విబేధాలు ఉన్నా కూడా ఆమెనే హీరోయిన్ గ రికమండ్ చేసిన హీరో కృష్ణ. వైజాగ్ లో జరిగిన ఒక కార్యక్రమం లో వాణిశ్రీ గారు కృష్ణ గారి దేవదాసు సినిమా గురించి కొన్ని అనుచితమయిన వ్యాఖ్యలు చేసారు, అప్పటి నుంచి వారి మధ్య మాటలు కరువయ్యాయి. అటువంటి సమయంలో డైరెక్టర్ పి.సి.రెడ్డి గారు గత జన్మల సబ్జెక్టు తో ఒక స్టోరీ రెడీ చేసుకొని కృష్ణ గారికి చెప్పారు, స్టోరీ నచ్చిన కృష్ణ గారు హీరోయిన్ ఎవరు అని అడిగారట. డైరెక్టర్ గారికి వాణిశ్రీని తీసుకోవాలని ఉన్నా చెప్పటానికి తటపటాయించారు, ఇంతలో కృష్ణ గారే, వాణిశ్రీ ని తీసుకోండి డిఫ్రెంట్ షేడ్స్ ఉన్నా పాత్ర కాబట్టి ఆమె అయితేనే కరెక్ట్ అన్నారట.

మరి మీరు ఆమెతో అంటూ నసుగుతున్న రెడ్డి గారితో, వ్యక్తిగత జీవితం వేరు, వృత్తి జీవితం వేరు ఆమెనే తీసుకోండి అన్నారట. విషయం వాణిశ్రీ గారితో చెప్పగానే కృష్ణ గారే స్వయంగా చెప్పారని తెలిసి ఆమె కూడా ఒప్పుకున్నారట. షూటింగ్ గ్యాప్ లో ఇద్దరు ఏడ ముఖం, పేడ ముఖం గ ఉన్నా షాట్ లో మాత్రం ఇద్దరు పాత్రల్లో లీనమయి నటించేశారట. కృష్ణ, వాణిశ్రీ ఆ విధం గ నటించిన సూపర్ హిట్ చిత్రం ” జన్మ జన్మల బంధం ” నటి నటులు అన్న తరువాత యేవో అభిప్రాయ బేధాలు వస్తుంటాయి అవి వృత్తి జీవితానికి అడ్డంకి కాకూడదు అన్న సూత్రాన్ని ఇద్దరు పాటించటం ప్రశంసనీయం..

Vijay Devarakonda Trashes Liger OTT Deal rumors!

Nandamuri Balakrishna set to romance f2 girl Mehreen pirzada?