in

Siddharth In Rahul Dravid’s Biopic?

సౌత్‌లో బయోపిక్ సినిమాలకుండే క్రేజే వేరు. సెలబ్రిటీల రియల్ లైఫ్‌ని బేస్ చేసుకుని తెరకెక్కే సినిమాలను సిల్వర్ స్క్రీన్ మీద చూడ్డానికి మూవీ లవర్స్, ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్స్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి. క్రికెట్‌కి సంబంధించి.. ధోని బయోపిక్ ‘ఎమ్ఎస్ ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ’, అజారుద్దీన్ బయోపిక్ ‘అజార్’ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. 1983లో కపిల్ దేవ్ టీం వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘83’ రిలీజ్‌కి రెడీ అవుతోంది.

ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బయోపిక్ రూపొందబోతోందని వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ్‌ సినిమాలతో అలరించిన టాలెంటెడ్ యాక్టర్ సిద్ధార్థ్ రాహుల్ ద్రావిడ్ క్యారెక్టర్ చెయ్యనున్నాడని తెలుస్తోంది. ఇటీవలే కథ విని సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. చాలా రోజుల తర్వాత ‘గృహం’ అనే థ్రిల్లర్‌తో హిట్ కొట్టిన సిద్ధార్థ్.. ప్రస్తుతం ‘ఆర్ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో, యంగ్ హీరో శర్వానంద్‌తో కలిసి ‘మహాసముద్రం’ సినిమాలో నటిస్తున్నాడు.

Rashmika mandhanna Pairs Up Nithiin Again?

hebah patel feeling sorry for selecting bad movies!