in

jabardasth ladies anasuya and rashmi team up for web series!

తెలుగు టాప్ యాంకర్లలో జబర్దస్త్ భామలు రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ పేర్లు  ముందు వరుసలో ఉంటాయి. ఈ ఇద్దరు భామలు జబర్దస్త్ షో తోనే పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఇద్దరూ కూడా ప్రస్తుతం సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. రష్మీ అడపాదడపా సినిమాలు చేసినా అనసూయ మాత్రం  చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు తమిళ, మలయాళ సినిమాల్లోనూ అనసూయ నటిస్తున్నట్టు ఇటీవల వెల్లడించింది.

అయితే తాజా టాక్ ప్రకారం అనసూయ, రష్మీ కలిసి ఓ వెబ్ సిరీస్ ను చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ ను మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటివరకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ఇతర రంగాల్లో సత్తా చాటింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని భావిస్తోందట. అంతేకాకుండా వెబ్ సిరీస్ లో అనసూయ, రష్మీ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జబర్దస్త్ షో సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు బ్యూటీలు ఒకే సిరీస్ లో ఏ మేరకు అలరిస్తారో చూడాలి..

Boyapati Srinu in talks for a bilingual with Suriya?

taapsee responds about her marriage with boyfriend Matthews!