in

Vijay Sethupathi in Jr NTR and Prashanth Neel film?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తికాగానే.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్నాడు. అదే విధంగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో కలిసి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ రూమర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇందులో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఆయనతో సంప్రదింపులు కూడా పూర్తి చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది…త్వరలో ఇందుకు సంబందించిన అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా రానుందట. ప్రశాంత్ నీల్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇదివరుకే మేకర్స్ ప్రకటించారు.

Sonu Sood’s sensational comments on Chandrababu Naidu!

hyper adi responds on bathukamma song controversy!