in

natural star Nani’s ‘Meet Cute’ to have five heroines!

నాని ఇప్పుడు ‘మీట్ క్యూట్’ అనే మరో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో తన సోదరి దీప్తిని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు నాని. ఇదొక మల్టీస్టారర్ సినిమా అని.. కానీ హీరోలు కనిపించరని.. హీరోయిన్ల మల్టీస్టారర్ అంటూ చెప్పుకొచ్చారు నాని. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని టాక్. అందులో ముగ్గురు పేరున్న హీరోయిన్లు కాగా.. మరో ఇద్దరు కొత్తవాళ్లని తెలుస్తోంది. వీరి పేర్లను నాని బయటకు చెప్పడం లేదు.

ఒక్కొక్కరి పేరు ఒక్కోసారి ప్రకటించి.. కొత్తగా పబ్లిసిటీ చేసుకుందామని నాని ప్లాన్ చేస్తున్నారట. నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్ వేసుకున్నారు. ఇది సింపుల్ గా సాగే స్టోరీ కాబట్టి భారీ సెట్ వర్క్ లు అవకాశం లేదు. అందుకే మొత్తం సెటప్ చేసుకొని షూటింగ్ కి రెడీగా ఉన్నారు. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నాని ఈ సినిమాతో పాటు ‘హిట్’కి సీక్వెల్ ను నిర్మిస్తున్నారు..

Samantha Flaunts Her ‘Fit’ness again!

Sonu Sood’s sensational comments on Chandrababu Naidu!