in

supreme hero chiranjeevi missing in america!

1988..సుప్రీం హీరో స్థాయినుంచి మెగాస్టార్ గా అప్పుడప్పుడు చిరంజీవి అడుగులు వేస్తున్న సమయం అది. ఒక్కరోజు ఖాళీ దొరికితే అదే మహా ప్రసాదం అనుకుంటున్న రోజులు. దాంతో చిరంజీవి, కె.ఎస్.రామారావు దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా అమెరికా వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లే ముందే చిరంజీవి ఒక కండిషన్ పెట్టారు. అమెరికాలో తామంతా సెలబ్రిటీల మాదిరి కాకుండా సాధారణ వ్యక్తుల్లా ఉండాలని కండిషన్ పెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లలో కాకుండా పబ్లిక్ వెహికల్స్ లో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు.

అంతే కాకుండా ఎక్కడికి వెళ్ళినా చాలా దూరం నడిచి వెళ్లారు. అలాంటి సమయంలో ఒక ఏసీ బస్సులో అందరూ ప్రయాణం చేశారు. తాము దిగాల్సిన చోటు వచ్చేసింది. తర్వాత అందరూ దిగారు.. ఒక చిరంజీవి తప్ప. దాంతో కెఎస్ రామారావు, అల్లు అరవింద్ తో పాటు అందరూ కంగారు పడుతూ ఉంటే.. రెండు స్టేషన్ల తర్వాత హాయిగా నవ్వుతూ నడుస్తూ కనిపించారు. ఈ సంఘటన అంతా ఈ మధ్య సోషల్ మీడియాలో చిరు అభిమానులు కొందరు పోస్ట్ చేశారు. ఏదేమైనా ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది.

priyamani revealed about her relation with vidya balan!

motta modhati train paataga gurtimpu pondina driver ramudu!