in

happy birthday D. Ramanaidu!

1964లో ‘సురేశ్ ప్రొడక్షన్స్’ సంస్థను నెలకొల్పినప్పుడు పదిమందికి మేలు చేస్తే చాలు అనుకున్నారు. సురేశ్ సంస్థ తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ విజయం సాధించగానే, వరుసగా చిత్రాలు నిర్మిస్తూ ముందుకు సాగారు రామానాయుడు. ఆయన ఉదారతను చూసి, ఎంతోమంది సురేశ్ సంస్థ నీడను చేరారు. తనను నమ్ముకున్న వారందరినీ ఆదుకోవాలన్నదే రామానాయుడు లక్ష్యంగా మారింది. అనూహ్య విజయాలను చూశారు. కొన్ని పరాజయాలూ పలకరించాయి. అయినా ఏ నాడూ చిత్రనిర్మాణాన్ని వీడలేదు. తమ సంస్థను ఆధారం చేసుకొని ఎన్నో కుటుంబాలు ఉన్నాయన్న ధ్యాసతోనే నాయుడు చిత్రనిర్మాణం సాగింది.

తన కుటుంబం ఎంచక్కా కూర్చుని తిన్నా తరిగిపోని ఆస్తులు సంపాదించారు రామానాయుడు. ఆయన చిత్ర నిర్మాణాన్ని ఓ వ్యసనంగా చేసుకున్నారు. ప్రతిభ ఉంటే చాలు పట్టుకు వచ్చి పట్టం కట్టాలని చూసేవారు. అలా ఎందరో నాయుడు నీడలో ఒదిగి, చిత్రసీమలో ఎదిగారు. వారందరూ ఈ నాటికీ ‘మా నాయుడు గారు’ అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా గుర్తు చేసుకొనే సమయంలో వారి కళ్లలో ఓ వెలుగు కనిపిస్తుంది. దాని వెనకాల కనీకనిపించకుండా కన్నీటి పొరకూడా దాగి ఉంటుంది. రామానాయుడు వల్లే చిత్రసీమలో తాము ఉన్నామన్న ఆనందం వెలుగును చూపిస్తే, ఆయన లేరన్న సత్యాన్ని ఆ కన్నీటి పొర చాటుతుంది.

f cube ‘Naveen Polishetty’!

telugu heroine Anjali clears marriage rumours!