టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ‘మోస్ట్ డిజైరబుల్-2020’ అనే ప్రెస్టేజియస్ లిస్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్ 2020లో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎంపికైంది. ఈ జాబితాలో సమంతా 2వ స్థానంలో, పూజా హెగ్డే 3వ స్థానంలో, రకుల్ ప్రీత్ 4వ స్థానంలో, రష్మిక మండన్న 5వ స్థానంలో నిలిచారు. అయితే శృతి హాసన్ దాదాపు రెండు సంవత్సరాలు..
అసలు టాలీవుడ్ లోని ఏ చిత్రంలోనూ కనిపించనేలేదు…అలాంటిది ఈ బ్యూటీ “మోస్ట్ డిజైరబుల్-2020″కి గానూ మొదటి స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక 2021లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది శృతి. ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’తో హిట్ కొట్టిన శృతి హాసన్ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్’తో మరో హిట్ ను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన “సలార్” చిత్రంలోనూ నటిస్తోంది..