ప్రేమ వ్యక్తిగత జీవితం పై ఇటీవల అనేక వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ప్రేమ ఆరోగ్యం గురించి రెండో పెళ్లి గురించి వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయం పై ప్రేమ ఓ ఇంటర్యూలో స్పందించింది..అయితే ఇటీవల ప్రేమ రెండవ వివాహంపై కన్నడ సినిమా ఇండస్ట్రీలో అనేక కథనాలు వినిపించాయి. ప్రేమ 2006లో జీవన్ అప్పచ్చు అనే ఒక వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే కొన్నాళ్లకు ఆమె అతని నుంచి విడిపోయి విడాకులు తీసుకుంది. తన విడాకులపై ప్రేమ ఎప్పుడు స్పందించలేదు. పెళ్లి, విడాకులు తన వ్యక్తిగత విషయం అని అందరికీ తెలిసేలా మాట్లాడడం తనకు నచ్చదని ఇటీవల ప్రేమ చెప్పింది. అంతేకాదు.. తాను కూడా క్యాన్సర్ బారిన పడినట్లు.. అయితే ఇప్పుడు క్యాన్సర్ ను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పింది అయితే తన రెండో పెళ్లి పై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఒంటరిగా ఉన్నానని తెలిపింది.