in

ismart beauty gets a call from koratala for ntr’s next!

యంగ్ హీరో సుదీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభనటేష్. ఆతర్వాత టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శశకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమా తో నభనటేష్ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. అందంతోపాటు నటనతో ఆకట్టుకున్న నభనటేష్ ఆతర్వాత రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’​ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఆ కలయికలో ఎన్టీఆర్ ​30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల ట్వీట్​ చేశారు. జూన్‌ రెండో వారం నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వాని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా నాభ నటేష్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..

can you Guess The Ages Of These Popular telugu Actors!

Payal Rajput goes back to Punjabi film industry!