in

huge Forest set for Prabhas ‘Adipurush’!

ప్రభాస్ చేయబోయేది రాముడి పాత్ర. ఇది రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇప్పుడు రామాయణ గాథను కొత్తగా ఆవిష్కరించేదేముంది అనేవాళ్లు కూడా లేకపోలేదు కానీ.. ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా ఈ పురాగణ గాథను విజువల్ వండర్ లాగా తీర్చిదిద్దాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నాడు. ఇందుకోసం ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను తీసుకున్నాడు. ‘ఆదిపురుష్’కు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్సే అతి పెద్ద ఆకర్షణ అవుతాయని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఒక కొత్త లోకాన్నే సృష్టిస్తున్నారట. ముంబయిలోని మధ ఐలాండ్‌లో భారీ ఎత్తున అడవి సెట్ వేశారట.

ఇక్కడే సినిమా తొలి షెడ్యూల్ షూట్ చేయబోతున్నారు. ఈ దీవిలో భారీ ఖర్చుతో అద్భుతమైన సెట్టింగ్స్ రూపుదిద్దుకున్నాయని.. అక్కడికి వెళ్తే ఓ కొత్త లోకంలోకి వెళ్లినట్లే ఉంటుందని.. కీలక సన్నివేశాల చిత్రీకరణ అంతా ఇక్కడే సాగుతుందని.. ఏ రకమైన డిస్టబెన్స్ లేకుండా.. తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో ఇక్కడ షూటింగ్ చేయబోతున్నారని సమాచారం. కరోనా నేపథ్యంలో ఏ సమయంలోనైనా 25 మందికి మించి సెట్స్‌లో లేకుండా స్వీయ పరిమితి విధించుకుని ఇక్కడ చిత్రీకరణ సాగించనున్నారట.

Hero Kartikeya asks for another chance!

Rashmika mandhanna gives a sweet warning to fans!