in

Anasuya Bharadwaj special song in ‘Maha Samudram’!

టాలీవుడ్ లో ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ రెచ్చిపోతుంది బుల్లితెర బ్యూటీ అనసూయ. అయితే జబర్దస్త్ నుండి పేరు సంపాదించుకున్న అనసూయ రంగస్థలంలో చేసిన రంగమ్మత పాత్రతో అభిమానుల మనసులు దోచుకుంది. ఇక తాజాగా చావు కబురు చల్లగా సినిమాలో కూడా ఓ సాంగ్ లో కనిపంచి ప్రేక్షకులను అలరించింది బ్యూటీ అనసూయ. తాజాగా రంగమ్మత్త మరో స్పెషల్‌ సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా ఫేమ్ దర్శకుడు అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్‌, సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలలో కనిపిస్తుండగా.. అదితి రావు, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో అనసూయ నటించబోతుందని తెలుస్తోంది. ఈమేరకు దర్శకుడు ఆమెతో సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.

dusky beauty pooja hegde confirmed for master’s next!

chiranjeevi gaari paathraku doop ga natinchina aayana p.a!