in

nidhi and Jacqueline roles revealed in pawan kalyan’s next!

ప‌వ‌న్ క‌ల్యాణ్ -క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. శివ‌రాత్రి సంద‌ర్భంగా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌నీ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ప‌వ‌న్ దొంగ‌గా క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ ఒక్క‌డే దొంగ కాదు. హీరోయిన్ కూడా దొంగే. వారిద్ద‌రి మ‌ధ్య సీన్లు.. క్రిష్ చాలా అందంగా, వినోదాత్మ‌కంగా రాసుకున్నాడ‌ట‌.

ఇందులో.. నిధి అగ‌ర్వాల్‌, జాక్వెలెన్ ఫెర్నాండేజ్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిధిది రాకుమారి టైపు పాత్ర‌. జాక్వెలెన్ దొంగ‌. కోహినూర్ వ‌జ్రం చుట్టూ తిరిగే క‌థ ఇది. ఆ వ‌జ్రాన్ని దోచుకోవ‌డానికి వీర‌మ‌ల్లు చేసే ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో సినిమా న‌డుస్తుంది. ఈ సినిమా కోసం చార్మినార్‌, గోల్కొండ, కుతుబ్ మినార్ సెట్లు వేశారు. 2022 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

Wild Dog Trailer, Akkineni Nagarjuna, Saiyami Kher, Ahishor Solomon!

sai pallavi’s sister pooja making her acting debut!