టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫిట్ నెస్ గురించి కొత్తగా చెప్పేదేముంటుంది? మంచి డైట్ మెయింటెయిన్ చేసే చందమామ.. తన శరీర సౌష్టవాన్ని పదేళ్లుగా పద్ధతి కాపాడుకుంటూ వస్తోంది. చెక్కిన శిల్పంలా ఉండే ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్స్ గురించి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల గురించి తెలిసిందే. పాలరాతి బొమ్మలా ఉండే ఈ అమ్మడు కూడా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతోందట..ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది కాజల్. ‘‘నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాంకియల్ ఆస్తమా అటాక్ అయ్యిందన్న విషయం తెలిసింది’’ అని చెప్పిందీ హీరోయిన్. పాలు చాక్లెట్లు మొదలు ఇష్టంగా అన్నీ తినాల్సిన వయసులో.. ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం తనకింకా గుర్తుందని చెప్పారు. ఇక శీతాకాలం వస్తే తన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు.