ఇరవై జంటలు, అంటే నలభై మంది ని ఆత్మ హత్య కు ప్రేరేపించి, బలి తీసుకున్న ఒక సినిమా, ఏంటి నమ్మటం లేదు కదూ? ఇది నిజం మీరు నమ్మి తీరాలి. నలభై ఏళ్ళ క్రితం ” “ఎంటర్ ది డ్రాగన్” సినిమా ప్రభావం తో భారత దేశం అంత మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ వెలిసాయి,” శంకరాభరణం” సినిమా తరువాత శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం నేర్చుకొనే వారు పెరిగారు, అదే కోవ లో ” మరో చరిత్ర ” సినిమా చూసి, నిస్పృహకు లోనైనా, ఇరవై ప్రేమ జంటలు ఆత్మ హత్య చేసుకోవటం జరిగింది. కొంత మంది అంటే అన వచ్చు సినిమా ప్రభావం సమాజం మీద పెద్దగా ఉండదు అని,అసలు సమాజం లో జరిగేదే కదా మేము చుపిస్తున్నాము అని అన వచ్చు కానీ, అన్ని సినిమాలు కాకపోయినా కొన్ని సినిమా లు తప్పకుండ ప్రభావితం చేస్తాయి అనడానికి నిదర్శనం ఇంతకంటే ఏమి కావాలి.
1978 లో రిలీజ్ అయిన ” మరో చరిత్ర”, కమల్ హాసన్, సరితా జంట గ నటించిన ప్రేమ కధా చిత్రం, సినిమా మొత్తం రొటీన్ కి భిన్నం గ తయారు చేసారు డైరెక్టర్ బాలచందర్ గారు, ప్రేమలో విఫలం అయిన కమల్, సరితా జంట నిస్పృహ తో ఆత్మ హత్య చేసుకుంటారు చివరిలో. ఆ సినిమా ప్రభావం తో విఫల జంటలు, ఆత్మ హత్యలకు పాలు పడ్డారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది, హిందీలో కూడా ” ఏ దూజే కె లిఏ” పేరుతో నిర్మించారు. ఆత్మ హత్యల గురించి తెలుసుకున్న బాలచందర్ గారు, ఎంతో మనస్తాపం చెంది, ఇటువంటి సినిమా చేసినందుకు క్షమాపణలు కోరారు , ఇక ముందు ఎప్పుడు ఇటువంటి సినిమా తీయను అని ప్రమాణం చేసారు. మనందరికీ తెలుసు బాలచందర్ గారు ఎంతటి నిబద్ధత కలిగిన దర్శకుడో, అటువంటి దర్శకుడు క్షమాపణలు కోరే పరిస్థితి తీసుకొచ్చింది ” మరో చరిత్ర” సినిమా.