in

SS Rajamouli’s RRR gets a release date!

సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల‌ల‌లో ఆర్ఆర్ఆర్ ఒక‌టి. కరోనా లేక‌పోయి ఉండి ఉంటే ఈ సినిమా జ‌నవ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది. కాని క‌రోనా వ‌ల‌న 8 నెల‌లు షూటింగ్స్ అన్నీ స్తంభించ‌డంతో  ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా ప‌డింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో క్లైమాక్స్ స‌న్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

భీం, రామ‌రాజులు ల‌క్ష్య సాధ‌న కోసం చేసే ఫైట్ సినిమాకే హైలైట్‌గా మారనుంద‌ని టాక్. చిత్ర షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నున్న నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ టీం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టింది. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ను ప్ర‌క‌టించారు.  అక్టోబ‌ర్ 13న చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలియ‌జేస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్‌పై దూసుకుపోతుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ గుర్ర‌పు స్వారీ చేస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

singer sunitha reaction on heroine chances!

naga babu gives clarity on varun tej’s marriage!