కథను హీరోగా నమ్మే డైరెక్టర్లలో దాసరి నారాయణ రావు గారు ఒకరు, ఆ క్రమం లోనే రాత్రికి రాత్రి హీరోని మార్చేసిన ఒక సంఘటన జరిగింది, అది 1980 దాసరి డైరెక్టర్ గ కృష్ణం రాజు హీరో గ “బండోడు గుండమ్మ ” సినిమా ముహూర్తం, ఉదయాన్నే అందరు స్టూడియోకి వచ్చారు, కృష్ణం రాజు గారు రాలేదు, కొద్దిసేపటికి హీరో కృష్ణ గారు వచ్చారు, దాసరి గారి అసిస్టెంట్లు, అస్సోసియేట్లు అందరు కృష్ణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయటానికి వచ్చి ఉంటారు అనుకున్నారు, కృష్ణ గారు ఫుల్ మేక్ అప్ తో వచ్చారు,
పూజ పూర్తి అవగానే కృష్ణ గారి మీద ఫస్ట్ షాట్ తీశారు దాసరి గారు, అక్కకడకు వచ్చిన వారందరికీ ఏమి అర్ధం కాలేదు. ముందు రోజు కృష్ణం రాజు గారికి, దాసరి గారికి మధ్య ఏదో వాదోపవాదాలు జరిగాయి, అంతే వెంటనే హీరోని మార్చేశారు, దాసరి గారు ఆరోజు రాత్రి కృష్ణ గారిని కలసి విషయం చెప్పి కృష్ణ గారిని ఒప్పించగలిగారు దాసరి, ఇదేమి తెలియని యూనిట్ సభ్యులు అందరు ఒకింత ఆశ్ఛర్యానికి లోనయ్యారు. గురువు గారి కమిట్మెంట్ గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదో జరిగి ఉంటుంది అనుకోని మౌనం గ వారి వారి పనులు చేసుకొని పోయారు..