నీ బలహీనతలు తెలిసినా కూడా బలాన్ని మెచ్చుకునేవాళ్లే నిజమైన స్నేహితులు.. ఊకో కాకా స్టోర్ ప్రారంభించేందుకు విచ్చేస్తున్న అషుకు స్వాగతం. మజాక్ కాదు, కాకా ఫ్రెండ్ అంటే ఇట్లుండాలె. ఇప్పుడు నాకింకా ధైర్యం వచ్చింది” అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అంతా బానే ఉంది కానీ ఈ పోస్టుకు అషును ఎత్తుకున్న ఫొటోను జత చేశాడు. ఇంకేముందీ, అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
‘నిజంగా స్నేహితురాలైతే అలా ఎత్తుకుంటారా? మీది ఫ్రెండ్షిప్ అంటే ఒప్పుకోము, ఏదో తేడా కొడుతోంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది..’ అంటూ కొందు పబ్లిక్‌గానే గుసగుసలు పెడుతున్నారు. వీళ్ల వాలకం చూస్తుంటే కుచ్ కుచ్ హోతా హై అనిపిస్తోందని మరికొందరు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. ‘ఎహె.. ఫ్రెండ్‌ను ఎత్తుకోవడం కూడా తప్పేనా? దానికే ఏదో అయిపోయినట్లు తెగ ఫీల్ అవుతారేంటి? మా రాహుల్ అన్నను ప్రశాంతంగా ఉండనివ్వరా?’ అని ఆయన వీరాభిమానులు గరమవుతున్నారు.