in

official : kanche beauty pragya jaiswal in balayya’s next!

నందమూరి హీరో బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ యాక్షన్ సన్నివేశాలను వచ్చే వారం పిడుగురాళ్లలో షూట్ చేయనున్నారు. కాగా, ఈ సన్నివేశాల్లో బాలయ్య కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఎవరు నటిస్తారనే గాసిప్స్ కి నేడు క్లారిటీ వచ్చేసింది.

తాజాగా ‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సందర్బంగా ద్వారకా క్రియేషన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియస్తూ అధికారికంగా అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు. మెయిన్ హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ప్రకటించడంతో.. మరో హీరోయిన్ గా పూర్ణ నటించే అవకాశం కనిపిస్తోంది. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు..

singer Sunita revealed details about how she met Ram!

Pranitha subhash donates a lakh for Ram Mandir!