in

Catherine Tresa on board for Kalyan Ram’s ‘Tughlaq’!

యువరాణిగా వెండితెరపై కనిపించబోతున్నది కేథరిన్‌ ట్రెసా. అపర పరాక్రమాలతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.  కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ‘తుగ్లక్‌’ పేరుతో ఫాంటసీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం తెరకెక్కుతోంది. పదమూడో శతాబ్దంతో పాటు నేటి కాలాన్ని ఆవిష్కరిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తన పాలన విధానాలతో అపఖ్యాతి పొందిన రాజుగా, నేటి యువకుడిగా భిన్న పార్శాలతో ఆయన పాత్రలు సాగనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో కేథరిన్‌ ఓ  కథానాయికగా నటిస్తున్నట్లు తెలిసింది. యువరాణిగా ఆమె ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. నటనాపరంగా వైవిధ్యతను కనబరిచే అవకాశం ఉన్న క్యారెక్టర్‌ కావడంతో కేథరీన్‌ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాతో వశిష్ట మల్లిడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదలచేసేందుకు చిత్రబృందం  సన్నాహాలు చేస్తోంది.

big boss beauty divi in pawan kalyan’s next?

thana modhati sampadhana nu thalli chethilo pettina jr.ntr!