in

Kajal Aggarwal Into Business, Launches ‘Kitched’!

గౌత‌మ్ కిచ్లుతో క‌లిసి కాజ‌ల్‌ ఇప్పుడు ప్ర‌త్యేక బ్రాండ్‌ని ప్రారంభించారు. కిచ్డ్ పేరిట ఓ హోమ్ డెకార్ బ్రాండ్‌ని వీరు స్టార్ట్ చేశారు. ఈ విష‌యాన్ని కాజ‌ల్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. గౌత‌మ్ నేను క‌లిసి మీ కోసం కిచ్డ్ అనే హోమ్ డెకార్ లేబుల్‌ని తీసుకొస్తున్నాము. మా ఇద్ద‌రి ప్రేమ నుంచి ఈ బ్రాండ్ పుట్టింది. ముందుగా ఫెస్టివ్ థీమ్‌తో చేతితో త‌యారు చేయ‌బ‌డిన కుష‌న్‌ల‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాము.

మీ అంద‌రికి న‌చ్చేవిధంగా, మీ ఇంటి అందాన్ని పెంచేలా, మీరు సంతృప్తి చెందేలా ప్రాడెక్ట్‌ల‌ను ఇవ్వ‌డ‌మే మా బ్రాండ్ ప్ర‌ధాన ఉద్దేశ్యం. మాకు మీ అంద‌రి స‌పోర్ట్ ఉంటుంద‌ని భావిస్తున్నా. ప్ర‌స్తుతం లిమిటెడ్ క‌లెక్ష‌న్ మాత్ర‌మే ఉంది. నిరూత్సాహం చెంద‌కుండా ఉండేందుకు మీరు త్వ‌ర‌గా షాపింగ్ మొద‌లుపెట్టండి. మా బ్రాండ్ నుంచి వ‌స్తోన్న మొద‌టి ప్రాడ‌క్ట్‌లు మీకు న‌చ్చుతాయ‌ని న‌మ్ముతున్నాం అని కాజ‌ల్ అగర్వాల్ ట్వీట్ చేశారు..

Rakul Preet Singh prefers a destination wedding at a beach!

Tamannaah as coach Jwala Reddy in Seetimaarr!