ఇటీవల ప్రముఖ పెళ్లి పత్రిక ఖుష్ వెడ్డింగ్ కవర్ పేజీలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో షూట్ చేశారు. ఇందులో ఆమె తన సినిమాలు, వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహం మరియు భాగస్వామి గురించి మాట్లాడారు. తాను చేసుకోబోయే భాగస్వామికి కొన్ని లక్షణాలు ఉండాలి అని ఆమె అన్నారు. “నా భాగస్వామికి జీవితం పట్ల మంచి అభిరుచి ఉండాలి. నేను ఆర్మీ కుటుంబం నుండి వచ్చాను సైన్యం నేపథ్యంలో పెరిగాను.
కాబట్టి, అతను ఖచ్చితంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆస్వాదించే వ్యక్తి అయి ఉండాలి. ” తన పెళ్లి 100మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనుందని తెలిపారు. ఇది బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉండాలి. ” ఇటీవలే నిహారిక వెడ్డింగ్ కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా జరిగింది. రకుల్ కూడా అదే తరహాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటుంది.