వరుసగా మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ తాప్సీ. ఈ ఏడాది `తప్పడ్`లో నటించి మెప్పించిన తాప్సీ ప్రస్తుతం మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. `రష్మీ రాకెట్` పేరుతో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో తాప్సీ అథ్లెట్‌గా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం తాప్సీ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. కఠినతర వ్యాయామం చేసి ప్రత్యేకంగా సంసిద్ధమైంది.
పూర్తి స్థాయి అథ్లెట్‌గా కనిపించేందుకు జిమ్‌లోనూ, ట్రాక్ మీద చెమటోడ్చింది. దానికి సంబంధించిన వీడియోను తాప్సీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “రష్మీ రాకెట్` కోసం చివరి ట్రైనింగ్ సెషన్‌ను పూర్తి చేశాను..ఈ సినిమా కోసం నేను చేసిన ప్రయాణాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా జర్నీకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ఇది` అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. తాప్సీ కష్టాన్ని హీరోయిన్ కాజల్ అగర్వాల్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, భూమీ ఫడ్నేకర్ తదితరులు ప్రశంసించారు…