in

uppena heroine signs 3 more movies!

సాధారణంగా చిత్ర సీమలో హీరోయినగా పేరు సంపాధించడం చాలా కష్టం. దానికి తోడు కొత్త హీరోయిన్ అంటే ఆఫర్లు అంతగా రావు. కొందరు అతి తక్కువ సమయంలోనే హీరోయిన్‌గా వచ్చి వెళ్ళిపోతారు. కొందరు ఎంత ప్రయత్నించినా చాన్స్‌లు దొరకవు. మరి కొందరు మొదటి సినిమాతోనే ఆగిపోతారు. కానీ ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా మంచి హీరోయిన్ అనే పేరు తెచ్చుకోవడం సినీ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు.

కానీ కృతి షెట్టి చరిత్రలో తనకంటూ ఓ పేజీని రాసుకుంది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మంచి హీరోయిన్‌గా పేరుతో పాటు మరో మూడు సినిమాల ఆఫర్లు అందుకుంది. ఈ మూడు సినిమాలు ఇంకా చర్చల దశలో ఉన్నాయి. అయితే కృతి నటించిన ఉప్పెన సినిమా ఇప్పటి వరకు విడుదల అవ్వలేదు. ఈ ఏడాదిలో విడుదల అవ్వాల్సిన సినిమా కాస్తా కరోనా అంటూ వాయిదా పడింది. ఈ సంవత్సరం ఎందరికో విషాదాన్ని అందించినా, ఉప్పెనా హీరోయిన్‌కు మాత్రం సరికొత్త రికార్డును అందించింది.

RANA ‘VIRAATA PARVAM’ first glimpse!

Sai Pallavi escaped a kissing scene thanks to #MeToo!