బాలీవుడ్ మీడియా రిపోర్ట్ ప్రకారం మురక హోటల్లో కాజల్ అగర్వాల్ జంట 10 రోజులు స్టే చేసింది. దీంతో హోటల్ అద్దె, ఆహారం, ఇతర సైట్‌సీయింగ్ ఖర్చులతో కలుపుకుని మొత్తం మీద కాజల్‌కు అయిన ఖర్చు అక్షరాల ఐదు కోట్ల రూపాయలు. అయితే కాజల్‌తో పాటు గౌతమ్ కూడా బాగా రిచ్ అవ్వడంతో ఇది వాళ్లకు పెద్ద ఖర్చు అయ్యుండదు అనుకున్నారు అంతా.. కానీ ఈ హనీమూన్ ట్రిపు కోసం.. ఆమె ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది.
ఎటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీగా హానీమూన్ ట్రిప్‌ను కాజల్ ఎంజాయ్ చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. మాల్దీవుల్లో టూరిజాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం సెలబ్రిటీలకు ఫ్రీగా పర్యటించేందుకు అక్కడి ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. సెలబ్రిటీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే ఈ ఆఫర్ పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాజల్‌కి 16 మిలియన్లకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె ఫ్రీగానే హనీమూన్ ట్రిప్ వేసినట్టు తెలుస్తోంది..