in

SURYA KOSAM INTI NUNDI BIRYANI THEPPINCHINA PRABHAS!

గజని ని ఆశ్చర్యపరచిన బాహుబలి, బాహుబలి కి గజానికి లింక్ ఏంటి అనుకోకండి, అక్కడికే వస్తున్నా. తమిళ్ సూపర్ స్టార్ సూర్య ఓ షూటింగ్ సందర్భం లో రామోజీ ఫిలిం సిటీ లో ఉండగా, తన ఎదురు రూమ్ లో ఉన్న ప్రభాస్ గారు మాటల సందర్భం లో ఆ రోజు రాత్రి భోజనానికి ఆహ్వానించారట సూర్య గారిని, సూర్య గారు అలాగే కలుద్దాం అన్నారు. షూటింగ్ షెడ్యూల్ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది, రూమ్ కి వస్తూ చాల లేట్ అయింది, ప్రభాస్ పడుకొని ఉంటాడు, రేపు సారీ చెబుదాం అనుకుంటూ వచ్చారట.

వచ్చి అయన డోర్ ఓపెన్ చేయబోతుండగా, ప్రభాస్ గారి రూమ్ డోర్ ఓపెన్ అయింది, మీ కోసమే వెయిట్ చేస్తున్నాను రండి డిన్నర్ చేద్దాం అన్నారట. తన కోసం అంత సేపు వెయిట్ చేస్తున్నందుకు సూర్య ఆశర్యపోతూ, రూమ్ లో కి వెళ్లే సరికి ప్రభాస్ గారు ఇంటి నుంచి తెప్పించిన ఫుడ్ చూసి మరింత ఆశ్చర్య పోయారట. ప్రభాస్ గారు మంచి ఫుడ్డి , నాలుగైదు రకాల బిరియానీ వడ్డించారట, ప్రభాస్ అందరిని డార్లింగ్ అంటూ పిలుస్తారు, ఆ ఫుడ్ రుచి చూసాక, అంత సేపు తన కోసం వెయిట్ చేయటం చూసాక, సూర్య గారికి ప్రభాస్ డార్లింగ్ అయిపోయారు..

3 heroines fixed for sathya dev’s next!

SAI PALLAVI REJECTED ANIL RAVIPUDI’S MOVIE?