in

AMRITHA RAO want FANS HELP!

హేష్ బాబు చేసిన ‘అతిథి’ చిత్రంలో కథానాయకిగా నటించిన అమృత రావు ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమృత తమ సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకొని అభిమానులతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, బాబు రాకతో తన కుటుంబంలో సంతోషం రెట్టింపు అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. తాను, బాబు ఇద్దరం బాగున్నామని, మాపై ఇంత ప్రేమ చూపించిన అభిమానులకి ధన్యవాదాలని అన్నారు. తమ రిలేషన్షిప్ 11 సంవత్సరాలు నిండిన సందర్భంగా తమకి ఇంతకుమించి వేరే బహుమతి అవసరం లేదని తెలిపారు.

అలాగే తన బాబుకు మంచి పేరు సూచించమని కూడ అభిమానులను కోరారు. అమృత రావు, ఆర్జె అన్మోల్ ని ఒక ఇంటర్వ్యూ ద్వార కలిశారు. కొన్నేళ్ల సంవత్సరాల రిలేషన్షిప్ తరువాత మే 15,2016 న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రేమ, పెళ్లి విషయాలను చివరికి తాను గర్భవతిని అనే విషయాన్ని కూడ గోప్యంగా ఉంచిన అమృతరావు ఇలా తమ బిడ్డకు పేరు పెట్టమని అడగడటంతో ఫ్యాన్స్ సైతం హుషారుగా సజెషన్స్ పంపుతున్నారు. చూడాలి మరి అమృతకి అభిమానులు సజెస్ట్ చేసిన పేర్లలో ఏది నచ్చుతుందో.

chandini chowdhary gets a crazy offer!

37 years for ‘MANTRI GARI VIYYANKUDU!