in

u will see new akhil in my film, says surender reddy!

యాక్షన్ హీరోలకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే హీరోలు చాలామంది యాక్షన్ ఇమేజ్ దక్కించుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. మొదటి సినిమా ‘అఖిల్’తోనే తనలోని ఆ కోరికను బలంగా బయటపెట్టారు అఖిల్. కానీ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసినా ఆయనకు ఆ కోరిక తీరలేదు. కానీ త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాతో అఖిల్ కోరిక నూటికి నూరు శాతం తీరుతుందట. ఈ మాట స్వయంగా సురేందర్ రెడ్డే చెబుతుండటం విశేషం.

‘అఖిల్’ చిత్రంలో అఖిల్ ఎనర్జీ లెవల్స్ చూసి ఆశ్చర్యపోయానంటున్న సురేందర్ రెడ్డి అతనిలోని యాక్షన్ హీరోను పూర్తిస్థాయిలో బయటికి తీస్తానంటున్నారు. తాను స్టోరీ రాసేటప్పుడు తన మనసులో అఖిల్ మాత్రమే ఉన్నాడని, ఆయనలోని మాస్ యాంగిల్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ బయటపడలేదని, కానీ తన సినిమాతో బయటికొస్తుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ‘రేసు గుర్రం’ సినిమాతో అల్లు అర్జున్ యాక్షన్ హీరోగా ఎంత బాగా ఎస్టాబ్లిష్ అయ్యారో తాను చేయబోయే సినిమాతో అఖిల్ అలాగే యాక్షన్ ఇమేజ్ తెచ్చుకుంటారని బలంగా అంటున్నారు

goa beauty ileana is ‘Unfair & Lovely’!

TRISHA AND SIMBU PLANNING TO GET MARRIED?