in

rakul stays away from social media!

సుశాంత్ సింత్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత రియా చక్రవర్తి చుట్టు ఉచ్చు బిగియడంతో ఇందులో డ్రగ్స్ యాంగిల్ బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్సీబి ( NCB ) అధికారులు సినీ తారలను కూడా విచారించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. ఆమెను ముంబైకి పిలిచి అక్కడ కొన్ని గంటల పాటు నార్కోటిక్స్ అధికారులు ప్రశ్నించారు. తరువాత ఆమె హైదరాబాద్ కు తిరిగి వచ్చి సినిమా షూటింగ్ లో చేరిపోయింది.ఈ విచారణ తరువాత రకుల్ ప్రీత్ సింగ్ కాస్త డిస్టర్బ్ అయినట్టు తెలుస్తోంది.

ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అందులో రకుల్ కూడా ఒకరు. అయితే డ్రగ్స్ కేసులో ఆమె పేరు వచ్చినప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంటున్నారు. తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలో ఎలాంటి పోస్టులు పెట్డడం లేదు. ట్విట్టర్ లో రకుల్ ను 4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. రకుల్ చివరిగా సెప్టెంబర్ 7న ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ గత రెండు వారాలుగా ఎలాంటి పోస్టులు పెట్టలేదు. ఆమెను 16 మిలియన్ల మంది ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు.

Trisha reveals her life turning point!

arvind swamy to play villain role in mahesh babu’s movie?