in

tollywood top directors at one place!

రోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన వారంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అలాంటి వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఆరు నెలలుగా షూటింగ్ లు బంద్ కావడం తో ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా కేంద్రం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం తో మళ్లీ ఆ పనుల్లో నిమగ్నమవుతున్నారు . రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పలువురు ఒక చోట చేరారు. చక్కగా పార్టీ చేసుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, క్రిష్, నాగఅశ్విన్, హరీష్ శంకర్, వంగా సందీప్ రెడ్డి, సుకుమార్, అనిల్ రావిపూడి, కొరటాల శివ, వంశీ పైడిపల్లి తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. డైరెక్టర్ క్రిష్ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

nithin ‘rang de’ misses huge offer?

balayya boyapati movie for sankranthi?