in

nara rohith in allu arjun movie!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కంబినేషన్లో ‘పుష్ప’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బన్నీస్నేహితుడిగా మరో హీరో కనిపించబోతున్నాడట. ఈ సినిమా కంటే ముందు వచ్చిన అల వైకుంఠపురములో కూడా హీరోలు నవదీప్, సుశాంత్ హీరోలు కనిపించరు. ఈసారి కూడా మరొకరు కనిపించనున్నారు. అది ఎవరో కాదు నారా రోహిత్. అవును ఈ సినిమాలో బన్నీ ఫ్రెండ్ గా నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. బన్నినే స్వయంగా ఆ పేరును సుకుమార్ కి సూచించాడట. ఆ పాత్రకు ప్రాధాన్యత కూడా బాగానే ఉందంట. ఎంతంటే రంగస్థలం లో ఆది పినిశెట్టి పాత్రలా ఈ సినిమాలో ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఇక బన్నీకి జోడీగా ఇందులో రష్మిక మందన్న నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

crazy offer for nithin’s ‘rang de’!

this is why mahesh rejected anil!