స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా ‘అల వైకుంఠపురములో. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ ఏడాది సంక్రాంతి కి విడుదలైన ఈ సినిమా బన్నీ కెరియర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. అలాగే అప్పటినుండి ఎన్నో రికార్డులను కైవసం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఆల్ టైం రికార్డు ను సొంతం చేసుకుంది. వెండితెర పై సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు టీవీలో కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని టీఆర్పీ ని ఈ సినిమా దక్కించుకు.
ఆ విషయాన్ని గీత ఆర్ట్స్ తమ ట్విట్టర్ వేదికగా తెలిపింది. అందులో… ఈ సినిమా 7 నెలల కింద థియేట్రికల్ గా, 6 నెలల కింద ఓటీటీ లో విడుదల అయ్యింది. అయిన ఇప్పటికీ అల వైకుంఠపురములో ఎప్పుడు ఏ తెలుగు సినిమాకైనా రాని రికార్డ్ బ్రేకింగ్ హైయెస్ట్ టీఆర్పీ – 29.4 ని సొంతం చేసుకుంది. అటువంటి అద్భుతమైన మీ ప్రతిస్పందన మరియు ప్రేమకు ధన్యవాదాలు” అని తెలిపింది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి ముఖ్య కారణం తమన్ అందించిన మ్యూజిక్ అని చెప్పాలి.