in

brathiki undagane SHAKALAKA SHANKAR photo ki dhanda vesi bhojanalu pettaru!

కలక శంకర్, తన నటనతో, శ్రీకాకుళం మాండలికం తో, రాంగోపాల్ వర్మ ను అనుకరించటం తో మంచి గుర్తింపు పొందిన కమెడియన్. శంకర్ ఇక లేడు అని ఫోటో కి దండ వేసి, భోజనాలు పెట్టేసారు 2008 కి ముందు.ఎందుకు ఆలా చేసారు శంకర్ ఇంట్లో వాళ్ళు తెలుసా ? టెన్త్ ఫెయిల్ అయిన శంకర్ సినిమాలో ఏదో ఒక పని చేసి పేరు సంపాదించాలి అని హైదరాబాద్ చేరాడు, ఆ ప్రయత్నం లో ఎనిమిది సంవత్సరాలు ఇంటి ముఖం చూడలేదు, ఇంట్లో వాళ్ళు సోదులు, జోతిష్యాలు ,అంజనాలు వేయించి ఆచూకీ లేక పోవడం తో ఫోటో కి దండ వేసేసారు. 2008 లో నోట్ బుక్ అనే సినిమా లో నటించే అవకాశం వచ్చిన శంకర్ రాజముండ్రి వెళ్లారు, ఆ టైం లోనే శంకర్ వాళ్ళ నాన్న గారు కూడా ఏదో పని మీద అక్కడకు వచ్చారు.

అక్కడ వీళ్ళు బస చేసిన లాడ్జి, ప్రక్కన మరో లాడ్జి లో ఉన్న శంకర్ నాన్న గారు రోజు శంకర్ ను చూస్తున్నకూడా నమ్మలేక, శంకర్ వాళ్ళ చిన్నాన్న ను పిలిపించారు అయన కూడా శంకర్ ను చూసి చనిపోయిన వాడు ఎలా వచ్చాడు, అనుకోని రెండు రోజులో గమనించిన తరువాత, అనుమానంగానే శంకర్ దగ్గరకు వచ్చి పలకరించారు, శంకర్ బ్రతికే ఉన్నాడు అని నిర్ధారించుకొని చాల సంతోషించారట.మళ్ళి ఊరిలో వారికీ భోజనాలు పెట్టి శంకర్ బ్రతికే ఉన్నాడు అని తెలియచేసి, బ్రతికి ఉండటమే కాదు సినిమాలో నటిస్తున్నాడు అని సంతోషంగా ప్రకటించారట.అదండీ షకలక శంకర్ పునర్జన్మ వృతాంతం…

ram pothineni controversial tweet on caste!

audience shows no interest in ‘thriller’!