తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా అవార్డుల విషయంలో తనకు జరిగిన అన్యాయంపై ఓపెనవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అసలు అవార్డులకు ఎలా ఎంపిక చేస్తారు? వాటి ప్రాతిపదికలు ఏమిటి? అన్నదానిపైనా తమన్నా నర్మగర్భంగా ఓ చిట్ చాట్ లో ఓపెనైంది. అవార్డులకు ఎంపిక అనేది అభిమానుల్ని తగ్గించదని ఫేట్ మార్చదని తమన్నా ఈ చాట్ లో తెలిపింది. నా సినిమాలు తీసే విధానం సంతృప్తికరంగా ఉంటే.. అవి బాగా ఆడితే అంతకు మించి ఇంకేదీ ముఖ్యం కాదు.
అవార్డుల్ని పట్టించుకోను అని కూడా తమన్నా వ్యాఖ్యానించడం ఆసక్తికరం. అయితే మిల్కీ వైట్ బ్యూటీ చాలాసార్లు అవార్డులకు నామినేట్ అయినా అవి తన వశం కాకపోవడంపై కొద్దిపాటి అసంతృప్తిని వ్యక్తం చేసింది. తనకు కేవలం అతికొద్ది అవార్డులు మాత్రమే దక్కడంపై బయటపడకపోయినా.. ఇన్ సైడ్ మిల్కీ ఫీలింగ్ ఏమిటన్నది తాజా ప్రకటనతో బయటపడిపోయింది.