in

meher ramesh to direct megastar?

మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి యువ ద‌ర్శ‌కుల‌కి ఆఫ‌ర్స్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న చిరు లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని సుజీత్ తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. క‌ట్ చేస్తే ఒక‌ప్పుడు అగ్ర ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటిన మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి సినిమా చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

మెహ‌ర్ ర‌మేష్‌కి రామ్ చ‌ర‌ణ్ ఓ బంపర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. అల్లు అర‌వింద్ ప్లాట్‌ఫాం ఆహా కోసం మెహ‌ర్ ర‌మేష్ ఒక సినిమా చేయాల‌ని చెప్పాడ‌ట చ‌ర‌ణ్‌. ఈ సినిమా క‌నుక మెగా ఫ్యామిలీకి న‌చ్చితే వెంట‌నే చిరుని డైరెక్ట్ చేసే అవకాశం ద‌క్కుతుందని ఫిలిం న‌గ‌ర్ టాక్. చూడాలి మ‌రి మెహ‌ర్ త‌న‌కి వ‌చ్చిన ఆఫ‌ర్‌ని ఎలా స‌ద్వినియోగం చేసుకుంటాడో..!

pantham negginchukunna krishna vamsi!

mahesh daughter sithara birthday!