రవిశంకర్ రాజు భూపతి రాజు, ఎవరో తెలుసా మీకు? అదేనండి మన మాస్ మహారాజ రవితేజ గారు, చిన్నతనం నుంచి సినిమాకు వీర అభిమాని, సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, అటువంటి వాళ్ళ చదువు ఎలా సాగుతుందో మనం చెప్ప వలసిన అవసరం లేదు. రవితేజ గారి నాన్న గారి ఉద్యోగ రీత్యా రవితేజ చిన్న తనం ఎక్కువగా నార్త్ ఇండియా లోనే గడిచింది. అందుకే రవితేజ గారు అమితాబ్ బచ్చన్ సినిమా లు చూసి,చూసి ఆయనకు వీరాభిమాని అయ్యారు, అవన్నీ మాకు తెలుసులేవో, ఇంతకీ నువ్వు చెప్పే కొత్త విషయం ఏంటి అంటారా, అక్కడికే వస్తున్నా, రవితేజ గారు భోపాల్ లో ఉంటున్న రోజుల్లో స్కూల్ కి బంక్ కొట్టి సినిమా చూసి ఇంటికి వచ్చారు.
ఇంటి బయటే కలసిన తమ్ముడు, విషయం ఇంట్లో తెలిసిపోయిది అని హింట్ ఇచ్చాడు, అంతే అక్కడ నుంచి వెళ్ళిపోయి , రోజంతా అటు ఇటు తిరిగి, చివరకు బొంబాయి ట్రైన్ ఎక్కేసారు, బొంబాయి వెళ్లి ఎదో ఒక పని చేసుకొంటూ సినిమా లో చేరాలి అనుకొన్నారు, కానీ మధ్యలో ఆత్మా రాముడు గోల పెట్టేసాడు ఆకలి, ఆకలి అని, వాడి గోల తట్టుకోలేక , మధ్యలో దిగి వెనక్కి ఇంటికి వచ్చేసారు, ఇంట్లో వాళ్ళు పెట్టిన చీవాట్లతో పాటు, అన్నం కూడా తిన్నారు. ఆకలి వేయక పోతే ఎంత ఘోరం జరిగేదో చూడండి. తెలుగు ప్రేక్షకులకు మాస్ మహారాజ ఉండేవాడు కాదు, థాంక్స్ టు ఆత్మ రాముడు.నెవెర్ గివ్ అప్ అన్న సూక్తి ని నమ్మిన రవితేజ గారు ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నారు.