అందాల తార కాజల్ అగర్వాల్ చూడటానికి చాల సున్నితం గ అమాయకంగా కనిపిస్తుంది కదూ, కానీ ఆమె మానసికంగా చాల దృఢమయిన అమ్మాయి, ధైర్యవంతురాలు. ఆ సంగతి మాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా, ఇప్పుడు నేను చెప్పే సంఘటన గురించి తెలుసుకున్నాక మీరు కూడా, ఎస్ కాజల్ ఇస్ ఆ బ్రేవ్ గర్ల్ అని ఒప్పుకుంటారు. తాను హై స్కూల్ చదివే రోజుల్లో బొంబాయి లోని చర్చి గేట్ స్టేషన్ నుంచి వెళుతుండగా, పేవ్మెంట్ మీద ఒకతను ఒక చిన్న పాపను నిర్దాక్షిణ్యంగా కొడుతుండటం చూసి, చలించి పోయింది, వెంటనే అతని దగ్గరకు వెళ్లి, ఎందుకు ఆ చిన్న పాపా ను ఆలా హింసిస్తున్నావు అని అతన్ని గట్టిగ ప్రశ్నించింది, పీకల దాక తాగి ఉన్న అతను, నేను బిచ్చగాడిని, ఈ పిల్ల నా కూతురు తనని కూడా బిచ్చమెత్తుకోవడానికి వెళ్లమంటే వెళ్ళను అని మొరాయిస్తుంది అందుకే కొడుతున్నాను,
kajal agarwal is sensitive and brave girl!
అయినా అడగటానికి నువ్వు ఎవరు, నీ పని చూసుకో అంటూ బెదిరించాడు. కానీ మన పంజాబీ కుడి, భయపడ లేదు, అతనితో గొడవకు దిగింది,దారిన వెళ్లే వాళ్ళను పోగేసింది, ప్రక్కనే ఉన్న చర్చి గేట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ ను వెంటపెట్టుకొని వచ్చి అతన్ని లోపల వేయించి, ఒక చైల్డ్ కేర్ ఆర్గనైజషన్ కి ఫోన్ చేసి ఆ పాపా ను వాళ్లకు అప్పగించింది.ఆ దారిలో కొన్ని వేల మంది తిరుగుతుంటారు కానీ ఎవరు పట్టించుకోలేదు, సున్నిత మనస్కురాలయిన కాజల్ గారు, అతనిని ఎదిరించి ఆ పాపా ను అతని నుంచి కాపాడింది, అంటే ఆమె ఎంత దృఢమయిన వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి అనేది మీరు కూడా ఒప్పుకొంటారు కదూ. ఎస్ కాజల్ ఇస్ ఆ సెన్సిటివ్ అండ్ బ్రేవ్ గర్ల్, ఎనీ డౌట్?