ఈనాటి తెలుగు యువతరం హీరోలు చాల మంది తెలుగు మాట్లాడతారు, కానీ చదవటం, వ్రాయటం రాదు ఈ విషయం అనేక సందర్భాల్లో వారి మాటల్లోనే మనం తెలుసుకొని ఉంటాము. తెలుగు మాట్లాడటం వ్రాయటం తెలిసిన ,మనకు ఉన్న కొద్దీ మంది యువ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. దీనికి కారణం ఎవరు అని తెలుసుకోవాలి అంటే ఈ కధనం పూర్తి గ చదవండి. అఖిల్ స్కూల్ రోజుల్లో అఖిల్ వలన అత్యంత క్షోభ కు గురి అయింది వాళ్ళ తెలుగు టీచర్, ఆవిడ పేరు సరోజ, ఆవిడ అక్కినేని నాగేశ్వర రావు గారి వీర అభిమాని, ఆవిడ అఖిల్ కి ఇచ్చిన హోమ్ వర్క్, అంటే ఏదయినా పండుగ గురించి వ్యాసం వ్రాసుకొని రమ్మంటే, మనవాడు రాసుకెళ్లిన తెలుగు చూసి, అంటే ,అది తెలుగు కాదు తెలుగుకి పట్టిన తెగులు అన్నమాట, అది చూసిన సరోజ మేడం ఆయాసం, ఆవేశం, కోపం అన్ని ఒక్క సారిగా ఆవహించేవట.
క్లాస్ లో అందరిని బయటకు పంపించి అఖిల్ ని చితగ్గొట్టేది అనుకుంటున్నారా, లేదు బాబు!అఖిల్ ని పట్టుకొని భోరుమని ఏడ్చేసేవారట. ఏమిట్రా ఈ తెలుగు మీ తాత గారు ఎంత చక్కటి తెలుగు మాట్లాడతారో తెలుసు కదా, మేమంతా ఆయన డైలాగ్స్ అంటే చెవి కోసుకొంటాము, అని బాధపడే వారట.15 రోజులకు ఒక సారి అమల గారిని పిలిచి మనవాడి తెలుగు పాండిత్యం గురించి చెప్పి విలపించే వారట.సరోజ టీచర్ విలాపం చూడలేక మన అఖిల్ కాస్త తెలుగు భాష మీద దృష్టి పెట్టటం కారణం గ ఈ రోజు తెలుగు చదవటం, వ్రాయటం చేయ కలుగుతున్నారు. తన డైలాగ్స్ ని తెలుగులోనే చదవగలరు, థాంక్స్ సరోజ టీచర్, మాకు ఒక తెలుగు భాష తెలిసిన హీరోని ఇచ్చినందుకు. అఖిల్ కూడా సరోజ టీచర్ కి థాంక్స్ చెప్పే ఉంటారు, స్క్రీన్ మీద మొట్ట మొదటి సారిగా తన డైలాగ్ తానే చదువుకొని డబ్బింగ్ చెప్పుకొన్నపుడు.