in

top 10 actresses who did de-glamour roles!

10. AMRITHA IN “30 ROJULLO PREMINCHADAM ELA”   

నీలి నీలి ఆకాశం పాట ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం “30 రోజుల్లో ప్రేమ”. ఆ సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ లో పల్లెటూరి అమ్మాయిగా కన్పించింది అమ్రితా..తెర మీద అలా కనిపించింది కానీ తెర వెనుక ఈ పిల్ల చాల మోడరన్ బాబోయ్.

09. AMALA PAUL IN “PREMA KHAIDHI”

ప్రేమఖైది చిత్రం ద్వారా పరిచయం అయిన అమలాపాల్ ..తన తొలిచిత్రంలోనే డీ గ్లామర్ రోల్ పోషించింది. ఆ సినిమాలో జిడ్డు ముఖంలా కనిపించడంకోసం అమలాకి మేకప్ బదులుగా ఆయిల్ వాడారని సమాచారం..అసలు ఈమె కొద్దిగా బ్లాక్ అందులో ఆయిల్ పూశారు అంటే ఇంక ఎలా కనిపించిందో మీరే ఊహించుకోండి.

08. RADHIKA APTE IN “RAKTHA CHARITRA”

లేట్ గా కెరీర్ స్టార్ట్ చేసినా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే.. రక్త చరిత్ర సినిమాలో రాధికా ఆప్టే సాధారణ గృహిణిగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో హెవీ మేకప్ లేకుండా కేవలం తన నటనతోనే కట్టిపడేసింది రాధికా.. ఈ సినిమా తరువాత ఇంక గ్లామర్ రోల్స్ చేస్తూ వేడి పుట్టిస్తుంది హాట్ రాధికా.

07. PRIYAMANI IN “VILLAIN”

ణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ , పృద్వీ , ప్రధాన పాత్రధారులుగా వచ్చిన విలన్ చిత్రంలో విక్రమ్ కి చెల్లెలుగా నటించింది ప్రియమణి..ఆ చిత్రంలో ప్రియమణి మేకప్ లేకుండానే నటించింది..మేకప్ తక్కువ ఉన్న ప్రియమణి నటనకు మాత్రం మార్కులు ఎక్కువ పడ్డాయి.

06. THAMANNA IN “ABHINETRI”

మిల్కీ బ్యూటి తమన్నా..అభినేత్రి,బాహుబలి రెండు సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ లో నటించింది.అభినేత్రి సినిమాలో గ్లామర్ డాల్ గా, పల్లెటూరి భార్యగా ద్విపాత్రాభినయం చేసిన తమన్నా..రెండు పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించింది బాహుబలిలో కూడా రెండు పాటల్లో మినహా సినిమా అంతా తమన్నా డిఫరెంట్ మేకప్ తో తన మిల్కీవైట్ స్కిన్ దాచిపెట్టేసి డీగ్లామర్ రోల్ పోషించింది.

05. RITHIKA IN “GURU”

గురు సినిమాలో బాక్సర్ గా పరిచయం అయిన నటి రితిక..ఈ సినిమాలో రాముడుగా చేపలు అమ్మే అమ్మాయిలాగా, బాక్సర్ లాగా డీగ్లామర్ రోల్లో కనిపించి అందరిని ఆకట్టుకుంది..కేవలం వేషమే కాకుండా నటనతో కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు.

04. SANJANA IN “DANDUPALYAM”

తెలుగులో అడపా దడపా సినిమాలు చేసిన సంజనా డీ గ్లామర్ రోల్ పోషించిన చిత్రం దండుపాళ్యం 2. ఈ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా నటించింది సంజనా. ఇదే సినిమాలో సంజన న్యూడ్ గా నటించిందనే వార్తలు గుప్పుమన్నాయి..కానీ దండుపాళ్యం బ్యాచ్ లో ఒక మాములు చీర లో బజార్ ఆంటీ ల సంజన చేసిన రోల్ ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి.

03. AISHWARYA RAJESH IN ‘WFL’

మిళంలో ఎక్కువగా నటించిన ఐశ్వర్య రాజేష్..ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ సరసన నటించి మంచి మార్కులే కొట్టేసింది.. కౌసల్యా క్రిష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ రెండింటిలో కూడా ఐశ్వర్య డీగ్లామర్ రోల్స్ లో నటించి మెప్పించింది..

02. SAMANTHA IN “RANGASTHALAM”

రంగస్థలం సినిమాలో ప్రతి పాత్రా అందరికి గుర్తుండిపోతుంది..అందులో రామలక్ష్మిగా నటించిన సమంతా తన ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులందరికి నచ్చేసింది..పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నట్టుగా సాగుతున్న సమంతా సినిమా కెరీర్లో రంగస్థలం రామలక్ష్మి పాత్ర ఒక ప్రత్యేక స్థానం..

01. ANUSHKA IN “BAHUBALI”

ప్రయోగాలకు పెట్టింది పేరు అనుష్క..ఎలాంటి పాత్రనైనా సునాయసంగా చేయడమే కాదు..పాత్రకోసం తగిన విధంగా తన శరీరాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటుంది..పాత్ర డిమాండ్ చేస్తే అందవిహీనంగా కనపడడానికి కూడా వెనకాడదు అనుష్క.బాహుబలి సినిమాలో అమ్మ క్యారెక్టర్లో డీ గ్లామర్ గా చూసిన అనుష్కని మొదట్లో ఎవరూ యాక్సెప్ట్ చేయనప్పటికి,తన నటనతో అందరిని కట్టిపడేసింది దేవసేన..

small screen girl’s big problems!

guess the real names of our star heroines!