బలిదానం(1982 ) సినిమా షూటింగు సమయంలో…అందాల నటుడు శోభన్ బాబు గారు తన కూతురిగా నటిస్తున్న బాల నటిని చెంపపై కొట్టాల్సిన సన్నివేశం ఉందని చెప్పారు దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ గారు. “ఇంత చిన్న పాపను నేను కొట్టాలా ?” అన్నారు శోభన్ బాబు. “నటించడమే కదండీ…” అన్నారు దర్శకులు. “నటనే అయినా చంటిపాప భయపడుతుంది కదండీ… ఈ సీన్ లో ఎమోషన్ క్యారీ కావడానికి కొట్టడమే అవసరం అనుకుంటే… అలాగే చేద్దాం… లేదంటే జస్ట్ కసురుకుంటే సరిపోతుంది కదా…” అన్నారు శోభన్ బాబు. దర్శకుడు “తప్పకుండా అలాగే చేద్దాం…” అని చెప్పి పాపను కసురుకుంటున్నట్లుగానే షాట్ తీశారు. శోభన్ బాబుకు చిన్నపిల్లలంటే ప్రాణం. పసిపిల్లల్ని ముద్దాడడం అంటే అంతకన్నా ఇష్టం. అందుకే ఆ షాట్ పూర్తవ్వగానే ఆ పాపను ఎత్తుకుని ముద్దాడి చాక్లెట్లు తెప్పించి ఇచ్చారు శోభన్ బాబు.
సినిమా షూటింగు సమయంలో… శోభన్ బాబు తన కూతురిగా నటిస్తున్న బాల నటిని చెంపపై కొట్టాల్సిన సన్నివేశం ఉందని చెప్పారు దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ గారు. “ఇంత చిన్న పాపను కొట్టాలా ?” అన్నారు శోభన్ బాబు. “నటించడమే కదండీ…” అన్నారు దర్శకులు. “నటనే అయినా చంటిపాప భయపడుతుంది కదండీ… ఈ సీన్ లో ఎమోషన్ క్యారీ కావడానికి కొట్టడమే అవసరం అనుకుంటే… అలాగే చేద్దాం… లేదంటే కసురుకుంటే సరిపోతుంది కదా…”అన్నారు శోభన్ బాబు. దర్శకుడు “తప్పకుండా అలాగే చేద్దాం…” అని చెప్పి పాపను కసురుకుంటున్నట్లుగానే షాట్ తీశారు. శోభన్ బాబుకు చిన్నపిల్లలంటే ప్రాణం. పసిపిల్లల్ని ముద్దాడడం అంటే అంతకన్నా ఇష్టం. అందుకే ఆ షాట్ పూర్తవ్వగానే ఆ పాపను ఎత్తుకుని ముద్దాడి చాక్లెట్లు తెప్పించి ఇచ్చారు శోభన్ బాబు.