in

roja is pushpa’s villain?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. వీరి కాంబో లో వచ్చిన ఆర్య ఆర్య 2 సినిమా ఇప్పటికే సూపర్ హిట్స్ గా నిలవగా, హ్యాట్రిక్ సినిమా గా వస్తున్న ఈ సినిమా పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.. పాన్ ఇండియా సినిమా వస్తున్న ఈ సినిమా ని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నారు. బన్నీకి జోడీగా రష్మిక మందన్న కనిపించబోతుంది. ఇక ఈ సినిమా లో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతి బాబీ సునీల్ శెట్టి ఇలా పలువురి పేర్లు వినిపించాయి. కానీ ఈ మూవీలో మరో పవర్ ఫుల్ పాత్ర ఉందట..

అదే లేడీ విలన్.ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం నటి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజాను సుకుమార్ ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే ఆమెకు ఈ సినిమా కథ చెప్పడం ఒప్పించడం జరిగిపోయాయట..బన్నీ సినిమాకు రోజా నిజంగానే ఓకే చెప్పి ఉంటే టాలీవుడ్లో రేర్ కాంబినేషన్ ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప సినిమాకు రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే విడుదలైన పుష్ప పోస్టర్తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఇప్పుడు సెలెక్ట్ అవుతున్న తారలను బట్టి చూస్తే ఈ సినిమా థియేటర్ లో మంచి ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అనిపిస్తుంది..

adha sharma’s new creativity!

movie genre in which you want to see your star heroes!